donald trump: డైట్ విషయంలో వైద్యుల సలహాలను పట్టించుకోని డొనాల్డ్ ట్రంప్

  • గత ఏడాది ట్రంప్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు
  • డైట్, ఎక్సర్ సైజ్ ప్లాన్ ఇచ్చిన డాక్టర్లు
  • ఇంతవరకు ఒక్కసారి కూడా ఫిట్ నెస్ రూమ్ లోకి వెళ్లని ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. 72 ఏళ్ల ట్రంప్ కు అధిక కొలెస్ట్రాల్ ఉంది. వైట్ హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత గత ఏడాది ఆయనకు తొలిసారి వైద్య పరీక్షలు నిర్వహించారు.

వైద్య పరీక్షల అనంతరం ట్రంప్ కు డైట్, ఎక్సర్ సైజ్ ప్లాన్ ను వైద్యులు ఇచ్చారు. అయినా, వాటిని ఆయన పట్టించుకోవడం లేదు. ఈరోజు ఆయన మరోసారి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ కు సన్నిహితంగా ఉండే ఒక డజను మంది వైట్ హౌస్ సిబ్బంది మాట్లాడుతూ, వైద్యుల సూచనలను ట్రంప్ పాటించడం లేదని చెప్పారు. తన ఆహారపుటలవాట్లను మార్చుకోవడానికి ట్రంప్ ఇష్టపడటం లేదని అన్నారు. వైట్ హౌస్ లో ఉన్న ఫిట్ నెస్ రూమ్ లోకి ఆయన ఒక్కసారి కూడా అడుగుపెట్టలేదని తెలిపారు. ఎక్సర్ సైజ్ అంటే 'వేస్ట్ ఆఫ్ ఎనర్జీ' అని అంటారని చెప్పారు.

donald trump
fitness
test
america
united states
  • Loading...

More Telugu News