Uttam Kumar Reddy: కాంగ్రెస్ తరుపున పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు 10 నుంచి దరఖాస్తు చేసుకోండి: ఉత్తమ్

  • పార్లమెంట్ ఎన్నికలలో పోటీకి ఆహ్వానం
  • గాంధీభవన్‌లో దరఖాస్తులు అందజేయాలి
  • తుది నిర్ణయం హై కమాండ్‌దే

వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 10 నుంచి పూర్తి బయోడేటాతో దరఖాస్తు చేసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు నేడు ఆయన ఒక ప్రకటన చేశారు.

తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈ నెల 10 నుంచి 12 వరకూ పూర్తి బయోడేటాను గాంధీభవన్‌లో అందజేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ తనకు అందిన దరఖాస్తులను స్క్రూట్నీ చేసి ఏఐసీసీకి నివేదిస్తుందని.. తుది నిర్ణయం మాత్రం హై కమాండ్‌దేనని ఉత్తమ్ తెలిపారు.

Uttam Kumar Reddy
Congress
Parliament elections
Telangana
Gandhi Bhavan
AICC
  • Loading...

More Telugu News