Andhra Pradesh: ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ పురుగుల మందు తాగిన యువ లాయర్!

  • కర్నూలు జిల్లాలోని నంద్యాలలో ఘటన
  • సెల్ఫీ షూట్ చేసుకున్న లాయర్ అనీల్
  • ఆరోగ్యం విషమంగా ఉందన్న డాక్టర్లు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం మరో వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. కర్నూలు జిల్లా నంద్యాల కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న అనిల్ కుమార్ ఏపీకి ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ ఈరోజు కోర్టు ఆవరణలోనే పురుగుల మందు తాగాడు.

‘ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు’ అనే నినాదాన్ని నుదుటిపై రాసుకున్న అనిల్.. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు, తోటి లాయర్లు ఆయన్ను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం అనిల్ కుమార్ ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.

Andhra Pradesh
Special Category Status
pesticides
young lawyer
Kurnool District
nandyala court
  • Loading...

More Telugu News