nagababu: ఎలక్షన్లు వచ్చినప్పుడే చంద్రబాబు రక్తం మరుగుతుంది!: నాగబాబు సెటైరికల్ వీడియో

  • ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు ఫైర్
  • రక్తం మరగడానికి నాలుగున్నరేళ్లు పట్టింది
  • యూట్యూబ్ లో వీడియో పోస్ట్ చేసిన మెగా బ్రదర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఏపీ అసెంబ్లీలో బీజేపీపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తే జైలులో పెడతారా? అని బీజేపీ సభ్యులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తీరు చూస్తుంటే తన రక్తం మరుగుతోందని వ్యాఖ్యానించారు. తాజాగా ఈ వ్యవహారంపై మెగాబ్రదర్ నాగబాబు ఫన్నీ వీడియోను విడుదల చేశారు.

ఈరోజు మై ఛానల్-నా ఇష్టంలో పోస్ట్ చేసిన వీడియోలో నాగబాబు స్పందిస్తూ.. ‘పాలు మరగడానికి నాలుగున్నర నిమిషాలు పడితే మన సీఎం రక్తం మరగడానికి నాలుగున్నరేళ్లు పట్టింది. ఎక్కువ మంట పెడితేనే పాలు మరుగుతాయి. ఎలక్షన్లు వస్తేనే చంద్రబాబు రక్తం మరుగుతుంది. థ్యాంక్యూ’ అని సెటైర్లు వేశారు. ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.

nagababu
funny video
milk and blood boiling
Chandrababu
Telugudesam
my channel naa istam
  • Error fetching data: Network response was not ok

More Telugu News