bharat ratna: భారతరత్న పురస్కారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఒవైసీ
- భారతరత్న అంటేనే బ్రాహ్మణ క్లబ్
- అగ్ర కులాల వారికే ఈ పురస్కారాలు దక్కుతాయి
- మోదీ పీఎం అయిన తర్వాత రాజ్యాంగం నిర్లక్ష్యానికి గురవుతోంది
భారత అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతరత్న అంటే బ్రాహణ క్లబ్ అంటూ విమర్శించారు. భారతరత్న పురస్కారాలు బ్రాహ్మణులతో పాటు అగ్ర కులాల వారికే వస్తాయని అన్నారు. కేవలం ఉన్నతవర్గాలకే పురస్కారాలను ఇవ్వడాన్ని తాను ఖండిస్తున్నానని చెప్పారు. మోదీ ప్రధాని అయిన తర్వాత రాజ్యాంగం నిర్లక్ష్యానికి గురవుతోందని మండిపడ్డారు. మందిరం కావాలా? మసీదు కావాలా? అంటే ఓ మతం వారికే మోదీ మద్దతు పలుకుతారని... ఇది దేశ ప్రజలను మోసగించడమేనని అన్నారు.