Bonda Uma: టీడీపీకి 150 సీట్లు రావడం ఖాయం: బొండా ఉమా

  • నిజాయతీగా పని చేసిన వారంతా మళ్లీ ఎన్నికవుతారు
  • మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాం
  • ఎమ్మెల్యేలు ఎందుకు బయటకొస్తున్నారో జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 150 సీట్లు రావడం ఖాయమని ఎమ్మెల్యే బొండా ఉమ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కోసం నిజాయతీగా పని చేసిన వారంతా మళ్లీ ఎన్నికవుతారని చెప్పారు. నవ్యాంధ్ర తొలి శాసనసభలో ఎమ్మెల్యేగా ఉండటం తన అదృష్టమని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని... కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు... 5 శాతం రిజర్వేషన్లను కల్పించిన ఘనత టీడీపీదేనని చెప్పారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వస్తున్నారో జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం ప్రజాతీర్పును ఉల్లంఘించడమేనని చెప్పారు.

Bonda Uma
jagan
kapu
Telugudesam
ysrcp
  • Loading...

More Telugu News