Pawan Kalyan: జనసేనలో విద్యావంతులు, నిపుణుల చేరిక.. ప్రశంసలు కురిపించిన మంచు మనోజ్!

  • ఈ కార్యక్రమాన్ని పవన్ ప్రారంభించారు
  • దీనిపై నేను సూపర్ హ్యాపీగా ఉన్నా
  • ట్విట్టర్ లో స్పందించిన టాలీవుడ్ హీరో

వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులు, విద్యావంతులు జనసేన పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాసేవ కోసం పలువురు విద్యావంతులు ముందుకు రావడాన్ని టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్వాగతించారు. దీనివల్ల ప్రజలకు గణనీయమైన లబ్ధి చేకూరుతుందని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించడం పట్ల తాను సూపర్ హ్యాపీగా ఉన్నానని తెలిపారు. విద్యావంతులు, నిపుణులపై నమ్మకంతో వీరికి పవన్ కల్యాణ్ బాధ్యతలు అప్పగించారని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన మనోజ్ పొన్ రాజ్, పుల్లారావు వంటి నిపుణులు జనసేనలో చేరిన సందర్భంగా తీసిన ఫొటోను ట్వీట్ కు జత చేశారు.

Pawan Kalyan
Andhra Pradesh
politics
educated professionals
help serve the public
Jana Sena
  • Loading...

More Telugu News