kalyanmalik: వచ్చే జన్మలోను తనే భార్యగా రావాలి: సంగీత దర్శకుడు కల్యాణ్ మాలిక్
- 'ఉమ' పద్ధతి నాకు నచ్చింది
- సంతోషంగా ఎలా ఉండాలో నేర్పించింది
- నాకే గిల్టీగా అనిపిస్తూ ఉంటుంది
సంగీత దర్శకుడిగా కల్యాణ్ మాలిక్ కి మంచి పేరు వుంది. 'ఐతే'.. 'అష్టా చమ్మా' .. 'అలా మొదలైంది'.. 'జ్యో అచ్యుతానంద' .. 'ఊహలు గుసగుసలాడే' సినిమాలు సంగీత దర్శకుడిగా ఆయన ప్రత్యేకతను ఆవిష్కరిస్తాయి. అలాంటి కల్యాణ్ మాలిక్ .. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ఈ ఇంటర్వ్యూలో తన భార్య గురించి ప్రస్తావిస్తూ .. 'ఉమ'ను మొదటిసారి చూసినప్పుడు ఆమె పద్ధతి నచ్చింది. నా గురించి ఉన్నది ఉన్నట్టుగా ఆమెకి చెప్పాను. నా వ్యక్తిత్వం నచ్చి ఆమె అంగీకారాన్ని తెలపడంతో మా పెళ్లి జరిగింది. నా దృష్టిలో 'ఉమ' ఒక స్పటికం లాంటిది. ఆమెకి నేను సరైన భర్తను కాదేమోననే గిల్టీ ఫీలింగ్ ఇప్పటికీ నన్ను వెంటాడుతూ ఉంటుంది.
నా కెరియర్ సాధారణంగానే వున్నా .. ఉన్నదాంట్లో సంతోషంగా బతక గలుగుతున్నానంటే అందుకు కారణం ఆమెనే. తన మోరల్ సపోర్ట్ నాకు లేకపోతే నేను చాలాసార్లు మోసపోయేవాడినేమో. అందుకే వచ్చే జన్మలో తనే భార్యగా రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.