Paritala sunitha: వైసీపీలో చేరిన వేపకుంట రాజన్న.. పార్టీ కండువా కప్పి పరిటాల అనుచరుడిని ఆహ్వానించిన జగన్

  • పరిటాల రవికి ముఖ్య అనుచరుడిగా పేరు
  • కాన్వాయ్‌ను మధ్యలోనే ఆపి కండువా కప్పిన జగన్
  • సముచిత స్థానం కల్పిస్తామని హామీ

పరిటాల రవి ముఖ్య అనుచరుడు వేపకుంట రాజన్న వైసీపీలో చేరారు. కడపలో గురువారం వైసీపీ నిర్వహించిన సమర శంఖారావం సభలో పాల్గొన్న జగన్ తిరిగి వెళ్తూ మార్గమధ్యంలో కాన్వాయ్‌ను ఆపి రాజన్నకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో రాజన్నకు సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు.

గత కొన్ని రోజులుగా మంత్రి సునీతపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న రాజన్న వైసీపీలో చేరబోతున్నట్టు వార్తలు వచ్చాయి. సునీత వైఖరి కారణంగా చంద్రబాబు ప్రభుత్వంలో పేదలకు అన్యాయం జరుగుతోందని ఇటీవల రాజన్న తీవ్ర విమర్శలు చేశారు. గత నాలుగేళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్న రాజన్న ఇప్పుడు వైసీపీలో చేరారు. 

Paritala sunitha
Vepakunta Rajanna
Kadapa District
Raptadu
Jagan
YSRCP
  • Loading...

More Telugu News