Khammam District: ఖమ్మం జిల్లాలో కంపించిన భూమి.. పరుగులు పెట్టిన ప్రజలు

  • అర్ధరాత్రి సమయంలో భూ ప్రకంపనలు
  • నిద్రపోతున్న వారు లేచి రోడ్లపైకి
  • రాత్రంతా జాగారం

గాఢ నిద్రలో ఉన్న వేళ ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. నిద్రపోతున్న వారు ఒక్కుదుటున లేచి బయటకు పరుగులు పెట్టారు. ఖమ్మం జిల్లాలో జరిగిందీ ఘటన. గురువారం రాత్రి 11:23 గంటలకు భూమి ఐదు సెకన్ల పాటు కంపించింది. కొత్తగూడెం, సుజాత నగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి.

భూకంపంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలు లోపలికి వెళ్లేందుకు భయపడ్డారు. మళ్లీ ఎక్కడ వస్తుందోనని రాత్రంతా జాగారం చేశారు. అయితే, అధికారులు మాత్రం అది భూకంపం కాదని, కేవలం చిన్నపాటి ప్రకంపనలేనని చెబుతున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మళ్లీ వచ్చే అవకాశం లేదని ధైర్యం చెప్పారు.

Khammam District
Earthquake
Telangana
Bhadradri Kothagudem District
  • Loading...

More Telugu News