chigurupati: పేద అమ్మాయి శిఖా చౌదరి నేడు బీఎండబ్ల్యు కారులో ఎలా తిరుగుతోంది?: జయరాం భార్య పద్మశ్రీ

  • డబ్బు కోసం శిఖా చౌదరి ఎంతకైనా తెగిస్తుంది
  • అలాంటి అమ్మాయి మా ఇంట్లో ఉండటం దురదృష్టం
  • రాకేశ్ రెడ్డి ఎవరో నాకు తెలియదు

పేద అమ్మాయి శిఖా చౌదరి నేడు బీఎండబ్ల్యు కారులో ఎలా తిరుగుతోందని జయరాం భార్య పద్మశ్రీ ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, విలాసవంతమైన జీవితానికి, డబ్బు కోసం ఆమె ఎంతకైనా తెగిస్తుందని, అలాంటి అమ్మాయి తమ ఇంట్లో ఉండటం చాలా దురదృష్టకరమని అన్నారు.

జయరాం చనిపోయిన వార్త తెలిసిన వెంటనే నందిగామకు శిఖా చౌదరి వెళ్లలేదని, జయరాం నివాసానికి వెళ్లి కీలకపత్రాలు, విలువైన వస్తువులను తీసుకుపోయిందని ఆరోపించారు. ఎక్స్ ప్రెస్ ఛానెల్ కి సంబంధించిన కీలక బాధ్యతలు ఆమెకు అప్పగించిన తర్వాతే ఆ ఛానెల్ భ్రష్టుపట్టిపోయిందని విమర్శించారు.

ఈ సందర్భంగా శిఖా చౌదరి ప్రియుడు రాకేశ్ రెడ్డి గురించి ఆమెను ప్రశ్నించగా, అతను ఎవరో తనకు తెలియదని స్పష్టం చేశారు. తన భర్త జయరాంకు రాకేశ్ రెడ్డి నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారనడంలో ఎటువంటి వాస్తవం లేదని, శిఖా చౌదరికే చెక్ పవర్ ఉందని వెల్లడించారు. తన భర్త జయరాంకు పలువురు మహిళలతో సంబంధాలున్నాయన్న వార్తలు వింటుంటే తనకు బాధగా ఉందని, ఆయనతో తనకు ఎటువంటి విభేదాలు లేవని పద్మశ్రీ స్పష్టం చేశారు.

chigurupati
jayaram
wife padma sri
sikha chowdary
  • Loading...

More Telugu News