chigurupati: నా భర్త హత్యకు పథకం వేసింది శిఖా చౌదరే: చిగురుపాటి జయరాం భార్య పద్మశ్రీ

  • శిఖా ప్రమేయం లేకపోతే నా భర్త చనిపోయేవారు కాదు
  • ఈ విషయమై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలి
  • నా భర్త ప్రాణాలకు ముప్పు ఉందని ఎప్పుడో భయపడ్డా

ప్రముఖ వ్యాపార వేత్త చిగురుపాటి జయరాం హత్యకు గురి కావడంపై ఆయన భార్య పద్మశ్రీ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, తన భర్త హత్య వెనుక శిఖా చౌదరి ప్రమేయం ఉందని, ఆమె ప్రమేయం లేకపోతే తన భర్త చనిపోయి ఉండే వారు కాదని అన్నారు. తమ ఆస్తులు లాక్కునేందుకు శిఖా చౌదరి తన ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేయించారని ఆరోపించారు. తన భర్త హత్యకు పథకం వేసింది శిఖాయేనని, ఈ విషయమై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు బయటపడతాయని అన్నారు. శిఖా చౌదరితో తన భర్త ప్రాణాలకు ముప్పు ఉందని ఐదేళ్ల క్రితమే తాను భయపడ్డానని వెల్లడించారు.

chigurupati
jayaram
wife padmasri
sikha chowdary
  • Loading...

More Telugu News