manchu manoj: మానవత్వం లేని మగాడు పుట్టడం దేనికి?: మంచు మనోజ్

  • ఆడపిల్లపై దాడి చేసే ముందు.. ఇంట్లో ఉన్న ఆడవాళ్లను తలచుకోవాలి
  • అప్పుడు ఆడవాళ్లపై దాడులు జరగవు
  • ఆడపిల్లలపై దాడి చేస్తే.. మన పుట్టుకకు అర్థం ఉండదు

హైదరాబాదులోని భర్కత్ పురాలో ఇంటర్ విద్యార్థిని మధులికపై భరత్ అనే యువకుడు కొబ్బరిబొండాల కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మధులిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

ఈ ఘటన నేపథ్యంలో సినీ హీరో మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. 'మానవత్వం లేని మగాడు పుట్టడం దేనికి? మనిషి అనే వాడు ఒక ఆడపిల్ల మీద దాడి చేసే ముందు... వాళ్ల ఇంట్లో ఉన్న ఆడవాళ్లను తలచుకుంటే ఇలాంటివి ఏనాడూ జరగవు. ఆడపిల్లల్ని రక్షించాల్సిన మగాడు... ఆడపిల్ల అనుభవించే నరకానికి కారకుడైతే... మనం పుట్టిన దానికి అర్థం ఏమిటి?' అంటూ ట్వీట్ చేశాడు. దీంతో పాటు భరత్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధులిక ఫొటోలను అప్ లోడ్ చేశాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News