Chandrababu: రాష్ట్రంలో జనాభా తగ్గుతోంది.. ఇలా అయితే రోబోలను తయారుచేసుకోవాలి!: చంద్రబాబు

  • జనాభా విషయంలో రాష్ట్రం మరో జపాన్ కాకూడదు   
  • పిల్లలను కనడం వల్ల రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతామని చెప్పారు
  • పిల్లలను వద్దనుకోవడం సరికాదు

ఏపీలో జనాభా తగ్గుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. శాసనమండలిలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఏపీ మరో జపాన్ లా కాకూడదని చెప్పారు. జనాభా తగ్గిపోతే రోబోలు తయారు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తుందని అన్నారు. పిల్లలను కనడం వల్ల రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతామని చెప్పారు. అభివృద్ధి చెందామనే భావనతో... పిల్లలను వద్దనుకోవడం సరికాదని అన్నారు. పిల్లలను వద్దనుకోవడం వల్ల జపాన్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోందని చెప్పారు. వృద్ధుల సంఖ్య పెరిగిపోయి, యువతరం తగ్గిపోయి ఇబ్బంది పడుతోందని అన్నారు.

Chandrababu
japan
Telugudesam
children
  • Loading...

More Telugu News