royal enfield: రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ల ధరలు పెంపు!

  • బుల్లెట్‌ 350 బైక్ రూ.1.34 లక్షలు
  • హిమాలయన్ ఎడిషన్ ధర రూ.1.80 లక్షలకు పెంపు
  • ఇంటర్‌సెప్టర్‌ 650, కాంటినెంటల్‌ జీటీ 650 ధరలు యథాతథం

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ పలు మోడల్స్  ధరలను పెంచింది. 350 సీసీ నుంచి 500 సీసీ సామర్థ్యం ఉన్న మోడల్స్ పై రూ.1500 వరకూ ధరను పెంచింది. అలాగే బుల్లెట్ 350, బుల్లెట్ 500, క్లాసిక్ 350, క్లాసిక్ 500, హిమాలయన్ మోడల్స్ ధరలను కూడా పెంచింది. కొత్త ధరల ప్రకారం బుల్లెట్‌ 350 బైక్ రూ.1.34 లక్షలకు లభ్యం కానుంది. క్లాసిక్ 350 ఏబీఎస్ రూ.1.53 లక్షలకు చేరుకుంది. ఇక క్లాసిక్ 350 ఏబీఎస్ సిగ్నల్స్ ఎడిషన్ ధర కూడా రూ.1.63 లక్షలకు పెరిగింది.

ఇక హిమాలయన్ ఎడిషన్ ధర రూ.1.80 లక్షల నుంచి మొదలుకానుంది. అయితే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఇంటర్‌సెప్టర్‌ 650, కాంటినెంటల్‌ జీటీ 650 ధరలు మాత్రం యథాతథంగా ఉన్నాయి. ఈ ధరలను ఎందుకు పెంచుతున్నామో కంపెనీ వెల్లడించనప్పటికీ ఉత్పత్తి వ్యయాలు పెరగడమే కారణమని భావిస్తున్నారు. పెరిగిన ధరలు ఈ నెల నుంచే అమల్లోకి రానున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News