Hyderabad: సామాన్యుడిపై నోరుపారేసుకున్న ఎస్‌ఐ... చర్యలు తీసుకున్న సీపీ

  • పండ్ల వ్యాపారిని దూషించిన ఫలితం
  • తిట్ల దండకాన్ని వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌
  • వైరల్‌గా మారడంతో సీపీ పరిశీలించి బదిలీ

పోలీసులంటే ఓ నమ్మకం...ఖాకీ కవచం ఉంటే నిర్భయంగా తిరగొచ్చన్న భరోసా...విపత్కర పరిస్థితుల్లో వారి చేయూత లభిస్తుందన్న ధైర్యం. యూనిఫాం అంటే అధికారం కాదని, బాధ్యతని చట్టం కూడా చెబుతోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న నినాదం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకోసం కృషి చేస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఓ పోలీసు అధికారి దౌర్జన్యంగా వ్యవహరిస్తే, సామాన్యుడిపై నోరు పారేసుకుంటే ఫలితం ఏమిటో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ తెలియజెప్పారు.

ఆ వివరాల్లోకి వెళితే... నగరంలోని టోలీచౌకీ పరిధిలో పండ్ల వ్యాపారం చేసుకునే వ్యక్తిపై ఇటీవల ట్రాఫిక్‌ ఎస్‌ఐ మహ్మద్‌ అంజాద్‌ నోరు పారేసుకున్నాడు. సదరు ఎస్‌ఐ పండ్ల వ్యాపారిని బండబూతులు తిడుతుండగా ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారి విమర్శలు వెల్లువెత్తడంతో సీపీ స్పందించారు.  వీడియోని పరిశీలించిన కమీషనర్.. అంజాద్‌ చేసిన తప్పును ప్రాథమికంగా నిర్ధారించి హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు.

  • Loading...

More Telugu News