Tanikella Bharani: భీమవరం సోమేశ్వరునికి పాలాభిషేకం చేసిన తనికెళ్ల భరణి!

  • భీమవరానికి వచ్చిన తనికెళ్ల భరణి
  • స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు
  • ఆలయం వద్ద సందడి వాతావరణం

ప్రముఖ సినీ నటుడు, ఆధ్యాత్మిక రచయిత, తనికెళ్ల భరణి సోమేశ్వరునికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి వచ్చిన ఆయన, సోమేశ్వరాలయాన్ని సందర్శించారు. స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు జరిపారు.

ఆలయ పురోహితులతో కలిసి రుద్రం, నమకం, చమకం తదితరాలను చదువుతూ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. తనికెళ్ల భరణి ఆలయానికి వచ్చారని తెలుసుకుని, ఆయన్ను చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు, అభిమానులు తరలిరావడంతో ఆలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది.

Tanikella Bharani
West Godavari District
Bhimavaram
Someshwar
  • Loading...

More Telugu News