Chandrababu: జగనన్న ఏంటి?... రాష్ట్రంలోని ఏ మహిళా అతన్ని అన్నగా అంగీకరించదు!: చంద్రబాబు నిప్పులు

  • నేరస్థుడు ఎలా ఉంటాడో మాత్రమే జగన్ కు తెలుసు
  • అన్న ఎలా ఉండాలో తెలియదు
  • ఏ మహిళా జగన్ ను అన్నగా భావించబోదన్న చంద్రబాబు

ఆర్థిక నేరాలకు పాల్పడి, జైలుకు వెళ్లి, కోర్టుల చుట్టూ తిరుగుతున్న వైఎస్ జగన్ ను రాష్ట్రంలోని ఏ మహిళా అన్నగా అంగీకరించదని ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఈ ఉదయం టీడీపీ నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, జగన్ కు ఓ నేరస్థుడు ఎలా ఉంటాడో తెలుసే తప్ప, అన్న ఎలా ఉండాలన్న సంగతి తెలియదని అన్నారు.

అన్నగా ఎలా ఉండాలో అసలు జగన్ కు తెలుసా? అని ప్రశ్నించిన చంద్రబాబు, తమ ప్రభుత్వం అన్ని వర్గాలకూ సంక్షేమాన్ని దగ్గర చేసిందని అన్నారు. ప్రతిపక్షం ప్రజలను ప్రలోభ పెట్టాలని చూస్తోందని, వారు ఎన్ని ప్రకటనలు చేసినా నష్టం లేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. మహిళలకు ఇచ్చిన 'పసుపు కుంకుమ' చెక్కులను పంచేసి ఊరుకోకుండా, వాటిని బ్యాంకులో వేయించి, డబ్బులు తీసుకునేంత వరకూ కార్యకర్తలు బాధ్యత వహించాలని సూచించారు.

Chandrababu
Jagan
Brother
  • Loading...

More Telugu News