Lovers Day: ప్రియా వారియర్ లిప్ కిస్... నెట్టింట దూసుకెళుతున్న 'లవర్స్ డే' టీజర్!

  • కుర్రకారు మనసులో తిష్టేసుకుని కూర్చున్న ప్రియా వారియర్
  • 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా 'లవర్స్ డే' విడుదల
  • 'ఫ్రీక్ పిల్లా' సాంగ్ కు లక్షల్లో లైక్స్

ఒక్క కనుగీటుతో కుర్రకారు మనసులో తిష్టేసుకుని కూర్చున్న ప్రియా వారియర్ హీరోయిన్ గా నటిస్తున్న 'లవర్స్ డే' టీజర్ విడుదలై ఇప్పుడు నెట్టింట దూసుకువెళుతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా 14వ తేదీన థియేటర్లను తాకనున్న చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తూ, ఓ లిప్ కిస్ సీన్ ను చూపించింది యూనిట్. 56 సెకన్ల నిడివిగల ఈ వీడియో యూత్ కు వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈ మధ్య సినిమాలోని 'ఫ్రీక్ పిల్లా' సాంగ్ విడుదల కాగా, లక్షల లైక్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

Lovers Day
Priya Varier
Teaser
Lip Kiss
  • Loading...

More Telugu News