Andhra Pradesh: ఏపీ శాసన మండలి చైర్మన్‌గా షరీఫ్.. నేడు అధికారిక ప్రకటన

  • శాసనమండలి చైర్మన్ పదవికి ఒకే ఒక్క నామినేషన్
  • ఏకగ్రీవంగా ఎన్నికైన షరీఫ్
  • నేడు ప్రకటన.. ఆ వెంటనే బాధ్యతల స్వీకరణ

ఏపీ శాసనమండలి చైర్మన్ పదవికి టీడీపీ సీనియర్ నేత ఎంఏ షరీఫ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. నేటి ఉదయం 11:30 గంటలకు ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. ఆ వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటి వరకు శాసనమండలి చైర్మన్‌గా ఉన్న ఎన్ఎండీ ఫరూక్‌ను ఇటీవల కేబినెట్‌లోకి తీసుకున్నారు. దీంతో మండలి చైర్మన్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా షరీఫ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఈ పదవికి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి వచ్చిన షరీఫ్ ఎన్టీఆర్ టీడీపీ ప్రారంభించినప్పుడు ఆ పార్టీలో చేరారు. అప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగుతూ వస్తున్నారు. పార్టీలో వివిధ పదవులు చేపట్టారు.

Andhra Pradesh
ap state council
Telugudesam
Chandrababu
MA Sharif
MLC
  • Loading...

More Telugu News