Mumbai: నా అనుమతి లేకుండా నన్ను కన్నారు.. మా అమ్మానాన్నలను అరెస్ట్ చేయండి: వైరల్ అవుతున్న పోస్ట్

  • నా ఇష్టం లేకుండా ఎలా జన్మనిస్తారు
  • నేనెందుకు బాధపడాలి? నేనెందుకు పనిచేయాలి?
  • యాంటీ నాటలిస్ట్ శామ్యూల్ పోస్టు వైరల్

తన అనుమతి లేకుండా తనను కన్నందుకు తన తల్లిదండ్రులను అరెస్ట్ చేయాలంటూ ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. ముంబైకి చెందిన రాఫెల్ శామ్యూల్ (27) తన ఫొటోపై ఇలా రాసి పోస్టు చేశాడు. గుబురు గడ్డం, మీసంతో ఉన్న శామ్యూల్.. తన తల్లిదండ్రులు అంటే తనకూ ఇష్టమేనని పేర్కొన్నాడు. అయితే, తనకు ఇష్టం లేకుండా ఈ భూమ్మీదకి వచ్చి తానెందుకు బాధపడాలని, తానెందుకు పనిచేయాలని ప్రశ్నిస్తున్నాడు.

నిజానికి శామ్యూల్ ఓ యాంటీ నాటలిస్ట్. ఇటువంటి వారు పిల్లలు కనడాన్ని వ్యతిరేకిస్తారు. పిల్లల్ని కనడమంటే భూమిపై భారాన్ని పెంచడమేనని, జీవితంలో బాధలు తప్ప మరేమీ ఉండవనేది వీరి అభిప్రాయం. ఇదే విషయాన్ని శామ్యూల్ తల్లిదండ్రులతో కూడా చెప్పాడట. తాను చెప్పింది విని తన తల్లి ఆశ్చర్యపోలేదని, అనుమతి తీసుకోకుండా కనడం తప్పని అనిపిస్తే, ఆ తప్పును ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తల్లి తనతో చెప్పారని శామ్యూల్ పేర్కొన్నాడు.

Mumbai
raphael samuel
Anti Natalism
Parents
Case
  • Loading...

More Telugu News