Viswa hindu parishad: వచ్చే నాలుగు నెలలూ ఎలాంటి ఆందోళనలు చేపట్టమన్న వీహెచ్పీ

  • రామమందిర నిర్మాణానికి ఆర్డినెన్స్ కు డిమాండ్
  • ఎన్నికల సమయం దగ్గర పడుతోంది
  • అందుకే, తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నాం: వీహెచ్పీ

అమోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టేందుకు ఓ ఆర్డినెన్స్ తీసుకురావాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చేస్తున్న ఆందోళనలను తాత్కాలికంగా ఆపాలని వీహెచ్పీ నిర్ణయించింది. లోక్ సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో వచ్చే నాలుగు నెలలూ ఎలాంటి ఆందోళనలు చేపట్టబోమని వీహెచ్పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ పేర్కొన్నారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో తమ ఆందోళనలు కనుక కొనసాగిస్తే ఎన్నికల ముందు ప్రజలను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్నామన్న విమర్శలు తలెత్తే ప్రమాదం ఉందని, ఓ పార్టీకి వంత పాడుతున్నామన్న భావన ప్రజల్లో కలిగే అవకాశాలు లేకపోలేదని, అందుకే, ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. 

Viswa hindu parishad
joint secretary
surendra jain
  • Loading...

More Telugu News