chaitu: చైతూ మూవీ శాటిలైట్ హక్కులకి భారీ రేటు

  • చైతూ .. సమంత జంటగా 'మజిలీ'
  • దర్శకుడిగా శివ నిర్వాణ
  • జీ తెలుగు చేతికి శాటిలైట్ హక్కులు          

ప్రేమకథా చిత్రాలు నాగచైతన్యకి కలిసొస్తున్నాయి. అందువల్లనే ఆయన తన తదుపరి సినిమాకి ప్రేమ కథాంశాన్నే ఎంచుకున్నాడు. 'మజిలీ' అనే పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సమంత ఒక నాయికగా నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా శాటిలైట్ హక్కులకు భారీ రేటు పలికింది. 'మజిలీ' సినిమాకి ముందు చైతూ 'సవ్యసాచి' చేశాడు .. ఈ సినిమా పరాజయం పాలైంది.

దాంతో సహజంగానే 'మజిలీ' శాటిలైట్ హక్కుల రేటు తగ్గుతుందని భావించారు. కానీ 6 కోట్ల రూపాయలకి జీ తెలుగు ఛానల్ వారు శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసినట్టుగా సమాచారం. చైతూ సినిమాలు ఓ మాదిరిగా ఆడినా .. శాటిలైట్ రేటు బాగానే గిట్టుబాటు అవుతుందని చెప్పుకుంటున్నారు. పెళ్లి తరువాత చైతూ .. సమంత కలిసి చేస్తోన్న ఫస్టు సినిమా కావడం వలన, ఈ స్థాయి రేటు పలికిందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.

  • Loading...

More Telugu News