Hyderabad: బాలికపై దాడికి పాల్పడ్డ భరత్ ను కఠినంగా శిక్షించాలి: బీజేపీ నేత కిషన్ రెడ్డి

  • సభ్య సమాజం తలదించుకునేలా ఈ దాడి జరిగింది
  • ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి
  • సమాజంలో ఉన్న అన్ని వర్గాలు ఆలోచించాలి

 ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోన్న మధులిక అనే బాలికపై భరత్ అనే యువకుడు కత్తితో దాడి చేసిన ఘటనపై బీజేపీ నేత కిషన్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ,ఈ దాడికి పాల్పడ్డ భరత్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా ఈ దాడి జరిగిందని, ఇలాంటి ఘటనలు జరగకుండా సమాజంలో ఉన్న అన్ని వర్గాలు ఆలోచించాలని సూచించారు. ఇంటి నుంచి బయటకెళ్లిన ఆడపిల్లలు తిరిగి క్షేమంగా వస్తారన్న నమ్మకం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  

Hyderabad
barkatpura
madhulika
bjp
kishan reddy
bharath
  • Loading...

More Telugu News