Andhra Pradesh: ‘కాల్ మనీ సెక్స్ రాకెట్’కు బుద్ధా వెంకన్నే సూత్రధారి!: జీవీఎల్ సంచలన ఆరోపణలు

  • వెంకన్నపై హోంమంత్రికి ఫిర్యాదు చేశాను
  • తప్పుడు పనుల్ని ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు
  • చంద్రబాబే మాతో పొత్తు కోసం అర్రులు చాచారు

టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఈరోజు మండిపడ్డారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ కు బుద్ధా వెంకన్నే సూత్రధారని జీవీఎల్ ఆరోపించారు. ఈ విషయమై హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఇప్పటికే ఫిర్యాదు చేశానని వ్యాఖ్యానించారు. ఏపీలో తప్పుడు పనులను ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసని అన్నారు. ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో జీవీఎల్ మాట్లాడారు.

పదేళ్ల పాటు అధికారానికి దూరమైన చంద్రబాబే బీజేపీతో పొత్తు కోసం అర్రులు చాచారని జీవీఎల్ విమర్శించారు. యూటర్న్ సీఎంగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని వ్యాఖ్యానించారు. రౌడీ నేతలను టీడీపీ అధినేత ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు హద్దుమీరి మాట్లాడుతున్నారనీ, దీన్ని సహించబోమని హెచ్చరించారు. బుద్ధా వెంకన్న తనకు బహిరంగంగా క్షమాపణ చెబితే ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేస్తానని స్పష్టం చేశారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
call money
S*x rocket
gvl narasimharao
BJP
budha venkanna
home monister
rajnath singh
  • Loading...

More Telugu News