vishnukumar raju: విశాఖ నార్త్ నుంచే పోటీ చేస్తా... ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో ప్రజలే నిర్ణయిస్తారు: విష్ణు కుమార్ రాజు

  • ఓటమి భయంతోనే నాయకులు స్థానాలు మారుతుంటారు
  • పెన్షన్లు, రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం పనితీరు బాగుంది
  • అన్ని పార్టీల వారితో నేను మంచిగా ఉంటా

పార్టీ మారడంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతోనే రాజకీయ నేతలు స్థానాలు మారుతుంటారని... తాను మాత్రం మళ్లీ విశాఖ నార్త్ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. అయితే, తాను ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే విషయాన్ని ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. పెన్షన్లు, రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వ పనితీరు బాగుందని కితాబిచ్చారు. తాను అజాత శత్రువునని, అన్ని పార్టీలవారితో మంచిగా ఉంటానని చెప్పారు. అమరావతిలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

vishnukumar raju
bjp
  • Loading...

More Telugu News