jhansi: కొన్ని రోజుల నుంచి నా కూతురు షూటింగులకు కూడా వెళ్లడం లేదు: ఝాన్సీ తల్లి

  • చిరాగ్గా ఉందని చెబుతూ ఇంట్లోనే ఉండేది
  • ఝాన్సీ ప్రేమ, సహజీవనం నాకు తెలియదు
  • ఆత్మహత్యకు పాల్పడినప్పుడు నా కుమారుడు మాత్రమే ఇంట్లో ఉన్నాడు

బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రేమలో విఫలం కావడం వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఝాన్సీ తల్లి స్పందించారు. కొన్ని రోజుల నుంచి తన కుమార్తె షూటింగ్ లకు వెళ్లడం లేదని ఆమె తెలిపారు. చిరాగ్గా ఉందని చెబుతూ ఇంట్లోనే ఉండేదని చెప్పారు.

తన కుమార్తె ప్రియుడిగా చెబుతున్న సూర్య ఎవరో తనకు తెలియదని అన్నారు. తన కుమార్తె ప్రేమ వ్యవహారం, సహజీవనం వంటి విషయాలు కూడా తనకు తెలియవని చెప్పారు. నిన్న రాత్రి ఝాన్సీ బలవన్మరణానికి పాల్పడిందని... ఆ సమయంలో ఆమెతో పాటు తన కుమారుడు మాత్రమే ఇంట్లో ఉన్నాడని తెలిపారు. 

jhansi
tv
actress
suicide
pavitrabandham
  • Loading...

More Telugu News