Andhra Pradesh: చంద్రబాబు ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తా!: దేవినేని అవినాశ్

  • నేడు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు
  • హాజరు కానున్న ఏపీ సీఎం
  • గుడివాడ లేదా నూజివీడు సీటుపై అవినాశ్ కన్ను

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న దేవినేని అవినాశ్ తెలిపారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అవినాశ్ ఈరోజు స్వీకరించనున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరవుతారని తెలిపారు. చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేయడం తన కర్తవ్యమన్నారు. యువతను చైతన్యవంతులను చేసి పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ ముందున్న లక్ష్యమని వ్యాఖ్యానించారు. గుడివాడ లేదా నూజివీడు అసెంబ్లీ సీటును దేవినేని అవినాశ్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

Andhra Pradesh
Chandrababu
devineni avinash
Telugudesam
  • Loading...

More Telugu News