Jhansi: పెళ్లి కుదరదన్నాడు, తీసుకున్న డబ్బులివ్వనన్నాడు... ఝాన్సీ ఆత్మహత్యకు ప్రియుడే కారణం?

  • గత రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన ఝాన్సీ
  • అంతకుందు ఇంటికి వచ్చిన ఓ యువకుడు
  • యువకుడితో వాగ్వాదానికి దిగిన ఝాన్సీ

టీవీ సీరియల్ నటి 'పవిత్రబంధం' ఫేమ్ ఝాన్సీ ఆత్మహత్య వెనుక ప్రేమ వ్యవహారంతో పాటు, ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె మృతదేహం గాంధీ ఆసుపత్రిలో ఉండగా, గుడివాడలో ఉంటున్న ఆమె కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని హైదరాబాద్ కు బయలుదేరారు.

మరణించడానికి ముందు ఆమె ఇంటికి ఓ యువకుడు వచ్చాడని, ఆపై వారిద్దరి మధ్యా వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే కొత్త సీరియల్స్ లో అవకాశాలు దక్కించుకుంటూ, ఎదుగుతున్న క్రమంలో సదరు యువకుడితో లవ్ లో పడ్డ ఝాన్సీ, అతనికి డబ్బు సాయం చేసినట్టు తెలుస్తోంది. పెళ్లి వరకూ వచ్చేసరికి అతను మొహం చాటేయడం, డబ్బు అడిగితే, ఇవ్వబోనని చెప్పడంతోనే మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం.

ఆత్మహత్యకు ముందు ఆమె తన కుటుంబ సభ్యులతోనూ మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ కేసును క్షుణ్ణంగా దర్యాఫ్తు చేస్తున్నామని, సాయి అపార్ట్ మెంట్స్ వాచ్ మెన్ ను ప్రశ్నిస్తున్నామని, సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని పంజాగుట్ట పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

Jhansi
Sucide
Tollywood
Tv
Artist
  • Loading...

More Telugu News