Andhra Pradesh: ఫోర్బ్స్ జాబితాలో విజయ్ దేవరకొండ.. ప్రశంసలు కురిపించిన కల్వకుంట్ల కవిత!

  • ఫోర్బ్స్ 30 అండర్ 30లో విజయ్
  • శుభాకాంక్షలు తెలిపిన కవిత
  • ట్విట్టర్ లో స్పందించిన టీఆర్ఎస్ నేత

ప్రముఖ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ జాబితాలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి నేత, నిజామాబాద్ లోక్ సభ సభ్యురాలు కల్వకుంట్ల కవిత విజయ్ ను ప్రశంసించారు.

ఈరోజు ట్విట్టర్ లో కవిత స్పందిస్తూ..‘ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకున్నందుకు శుభాకాంక్షలు విజయ్. నీ ప్రయాణం ఇలాగే గొప్పగా సాగాలి. మీ నాన్నగారు నిర్దేశించిన లక్ష్యాన్ని నువ్వు అందుకున్నందుకు మరోసారి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. తల్లిదండ్రుల అంచనాలను అందుకోవడం పిల్లలకు కష్టమైన పని అని కవిత అభిప్రాయపడ్డారు.

Andhra Pradesh
Telangana
vijay devarakonda
K Kavitha
TRS
praise
congratulations
forbes list
  • Loading...

More Telugu News