Tirumala: తిరుమలలో విషాదం... తలనీలాలిచ్చేందుకు వచ్చి, మూడో అంతస్తు నుంచి కిందపడిన బాలిక మృతి!

  • తిరుమలకు వచ్చిన కర్ణాటక దంపతులు
  • తల్లిదండ్రులతో కలిసి వచ్చిన చంద్రిక
  • ఆడుకుంటూ కాలుజారి కిందపడి మృతి

తిరుమలలో ఘోర విషాదం చోటు చేసుకుంది. తన తల్లిదండ్రులతో కలసి స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ బాలిక, తలనీలాలు ఇచ్చేందుకు వెళ్లి, కల్యాణకట్ట భవనం మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కిందపడి, తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కర్ణాటక ప్రాంతానికి చెందిన ఓ జంట తమ బిడ్డ చంద్రికతో కలిసి స్వామి దర్శనానికి వచ్చింది.

 తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలో రద్దీ ఎక్కువగా ఉండటంతో వారు వేచిచూస్తుండగా, చిన్నారి మిగతా పిల్లలతో ఆడుకుంటోంది. ఈ క్రమంలో భవంతి చివరకు వెళ్లిన చంద్రిక, కాలు జారి కిందపడింది. ఆడుకుంటూ ఉన్న అమ్మాయి కింద పడిందని తోటి పిల్లలు చెప్పడంతో, విధుల్లో ఉన్న విజిలెన్స్ సిబ్బంది ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటివరకూ తమతో నవ్వుతూ ఉన్న బిడ్డ ఇక లేదని, తిరిగి రాదని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతుండగా, వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.

Tirumala
Tirupati
Died
Girl
Father
  • Loading...

More Telugu News