Chigurupati Jayaram: ప్రస్తుతం మేమేమీ చేయలేం: జయరామ్ హత్య కేసుపై తెలంగాణ పోలీసులు

  • ప్రస్తుతం కేసు ఏపీ పరిధిలో ఉంది
  • మా వద్దకు వస్తేనే ఏదైనా చేయగలం
  • జూబ్లీహిల్స్ సీఐ హరీశ్ చంద్ర

ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ప్రస్తుతానికి తాము ఏమీ చేయలేమని జూబ్లీహిల్స్ సీఐ హరీశ్ చంద్ర వ్యాఖ్యానించారు. ఈ కేసును ప్రస్తుతం ఏపీ పోలీసులు విచారిస్తున్నారని, వారి విచారణ ముగిసిన తరువాత లేదా కేసు తమ పరిధిలోకి వచ్చిన తరువాత మాత్రమే రంగంలోకి దిగుతామని ఆయన స్పష్టం చేశారు. నిన్న జయరామ్ భార్య పద్మశ్రీ, జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి, తన భర్త హత్య వెనుక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఏపీ పోలీసులు అసలు నిందితులను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తనకు అనుమానంగా ఉందని కూడా ఆమె ఆరోపించారు. దీంతో ఈ కేసులో న్యాయ నిపుణుల సలహాను తీసుకుని ముందడుగు వేయాలని తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు.

Chigurupati Jayaram
Murder
Telangana
Andhra Pradesh
Police
Case
Enquiry
  • Loading...

More Telugu News