Tamilnadu: ఇంట్లోకి చేరి మంచం కింద దూరిన చిరుతపులి!

  • తమిళనాడు నీలగిరి జిల్లాలో ఘటన
  • అడవుల నుంచి పారిపోయి ఇంట్లోకి వచ్చిన చిరుత
  • నేడు పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

ఎలా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందోగానీ, ఇంట్లోకి చేరిన ఓ చిరుతపులి మంచం కింద దూరి, ఇంటి వారితో పాటు ఊరివాళ్లనూ పరుగులు పెట్టించింది. ఈ ఘటన తమిళనాడు నీలగిరి జిల్లా పందలూరు సమీపంలోని కైవట్టా అనే గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రైతు, తోటలో పనికి వెళ్లి, మధ్యాహ్నం ఇంటికి వచ్చిన వేళ, మంచం కింద ఏదో చప్పుడైతే చూశాడు. దీంతో మంచం కింద చిరుత పులి కనిపించగా, అతను, అతని భార్య భయంతో బయటకు పరుగులు తీసి ఇంటికి తాళం వేశారు. ఈ విషయాన్ని అధికారులకు చేరవేయడంతో చిరుతకు మత్తు ఇచ్చి లేదా వల వేసి పట్టుకుంటామని తెలిపారు. నీలగిరి అడవుల నుంచి ఇది దారితప్పి వచ్చివుండవచ్చని అధికారులు తెలిపారు.

Tamilnadu
Nilagiri
Leopard
House
Cot
  • Loading...

More Telugu News