jeevita rajashekar: జీవితకు తమాషా అయిపోయింది..!: కౌశిక్ రెడ్డి ఫైర్

  • నేనొక క్రికెటర్ ని.. నేనేమీ రౌడీ షీటర్ ని కాదు
  • దేశం తరపున జెండా మోసిన వ్యక్తిని నేను
  • నాడు చిరంజీవి పైనా జీవిత లేనిపోని వ్యాఖ్యలు చేసింది

హీరో రాజశేఖర్ తమ్ముడు గుణశేఖర్ పై టీ-కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి దాడి చేసిన వ్యవహారంలో ఇరువురు పరస్పర ఆరోపణలు చేస్తూ జూబ్లీహిల్స్  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై మీడియాతో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, తానొక క్రికెటర్ ని అని, దేశం తరపున జెండా మోసిన వ్యక్తినే తప్ప, రౌడీషీటర్ ని కాదని అన్నారు.

జీవితకు తమాషా అయిపోయిందని, నాడు చిరంజీవి మీద, అరవింద్ పైనా లేనిపోని వ్యాఖ్యలు చేసిందని విమర్శించారు. జీవితను పట్టించుకునే వాళ్లెవరూ లేకపోవడంతో ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ క్రియేట్ చేయాలని చూస్తోందని, ఆ న్యూస్ క్రియేట్ చేసేందుకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారని విమర్శించారు. నిజంగా, బాధ కలిగితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి వెళ్లిపోకుండా మీడియాతో మాట్లాడాల్సిన అవసరమేంటని జీవితను ప్రశ్నించారు. రాజకీయంగా తనను అపకీర్తిపాలు చేసేందుకే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

jeevita rajashekar
kaushik reddy
gunashekar
  • Loading...

More Telugu News