shivakarthikeyan: 'సీమరాజా'లో సిమ్రన్ విలనిజం చూసితీరవలసిందే: నిర్మాత సాయికృష్ణ

- తమిళంలో హిట్ కొట్టిన 'సీమరాజా'
- అదే పేరుతో తెలుగులోకి
- ఈ నెల 8వ తేదీన విడుదల
ఇటీవల తమిళంలో విడుదలైన 'సీమరాజా' అక్కడ భారీ వసూళ్లను సాధించింది. శివకార్తికేయన్ సరసన సమంత .. కీర్తి సురేశ్ నాయికలుగా నటించగా,లేడీ విలన్ గా సిమ్రన్ నటించింది. శివకార్తికేయన్ కెరియర్లోనే చెప్పుకోదగినదిగా నిలిచిన ఈ సినిమాను, అదే టైటిల్ తో తెలుగులో ఈ నెల 8వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను నిర్మాత సాయికృష్ణ తీసుకురానున్నారు.
