chammak chandra: చమ్మక్ చంద్ర కష్టపడి పైకొచ్చాడు .. మంచి మనసున్న మనిషి ఆయన: 'జబర్దస్త్' సత్తిపండు

  • నా టాలెంట్ గురించి నాకు తెలియదు
  • చంద్ర నాకు లైఫ్ ఇచ్చాడు 
  • ఆయన ఎన్నో దానాలు చేస్తుంటాడు    

'జబర్దస్త్' కామెడీ షోతో మంచి పేరు తెచ్చుకున్న సత్తిపండు, తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'చమ్మక్ చంద్ర' గురించి ప్రస్తావించాడు. "నాలో ఎంత టాలెంట్ ఉందనేది నాకు తెలియదు .. అలాంటి నాకు మంచి గుర్తింపు రావడానికి చమ్మక్ చంద్ర కారకుడు. నా ముఖం అద్దంలో చూసుకుని నేనే భయపడేవాడిని. అలాంటిది ఈ రోజున నాతో ఫోటోలు దిగడానికి చాలామంది ఆసక్తిని చూపుతుండటం విశేషం.

చమ్మక్ చంద్ర ఎంతో కష్టపడి పైకొచ్చాడు. నిజం చెప్పాలంటే ఆయన జీవితం నా లాంటి వాళ్లందరికీ ఒక స్ఫూర్తిని ఇస్తుంది. ఒకసారి మేమంతా రిహార్సల్స్ చేస్తుండగా కృత్రిమంగా అమర్చబడిన కాళ్లతో ఒక వ్యక్తి అక్కడికొచ్చి చమ్మక్ చంద్రకి కృతజ్ఞతలు తెలియజేసి వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి కృత్రిమ కాళ్లకి కావలసిన సాయం చేసింది చంద్రయేనని అప్పుడు మాకు తెలిసింది. ఎవరికీ చెప్పకుండా ఆయన గుప్తదానాలు చేస్తుంటాడు. మంచి మనసున్న మనిషి ఆయన" అంటూ చెప్పుకొచ్చాడు.

chammak chandra
satthipandu
  • Loading...

More Telugu News