satthipandu: చమ్మక్ చంద్ర స్కిట్స్ తోనే నాకు మంచి పేరొచ్చింది: 'జబర్దస్త్' సత్తిపండు

  • మొదటి నుంచి నటనంటే ఇష్టం
  •  నాటకాలు వేసిన అనుభవం వుంది
  •  'జబర్దస్త్'లో అలా ఛాన్స్ వచ్చింది      

'జబర్దస్త్' కామెడీ షో చాలా మంది ఆర్టిస్టులకి గుర్తింపు తెచ్చిపెట్టింది. అలా ఈ కామెడీ షో ద్వారా పాప్యులర్ అయిన ఆర్టిస్టులలో 'సత్తిపండు' ఒకరు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .." మొదటి నుంచి కూడా నాకు నటన అంటే ఇష్టం. అందువలన నాటకాలు వేస్తూ ఉండేవాడిని. ఎక్కువగా కామెడీకి సంబంధించిన పాత్రలనే చేస్తూ ఉండేవాడిని. టీవీ షోల్లో .. సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉండేది.

ఆ సమయంలోనే నా మిత్రుడి ద్వారా .. 'జబర్దస్త్'లో చేస్తోన్న షేకింగ్ శేషు పరిచయమయ్యాడు. కొంతకాలం ఆయన టీమ్ లో కొనసాగాను. ఆ తరువాత 'చమ్మక్ చంద్ర' టీమ్ లో చేస్తూ వస్తున్నాను. 'చమ్మక్ చంద్ర' తో కలిసి చేసిన స్కిట్స్ మంచి పేరు తెచ్చిపెట్టాయి. నటన పరంగా .. స్క్రిప్ట్ పరంగా ఆయనకీ మంచి అనుభవం వుంది. స్కిట్ పెర్ఫెక్ట్ గా వచ్చేవరకూ అందరితో రిహార్సల్స్ చేయిస్తూనే ఉంటాడు. నాకు వచ్చిన గుర్తింపుకు ఆయనే కారకుడు" అని చెప్పుకొచ్చాడు. 

satthipandu
chammak chandra
  • Loading...

More Telugu News