ap: ఏపీ బడ్జెట్ సమావేశాల్లో 6 కొత్త పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- రూ. 2,26,177.53 కోట్లతో బడ్జెట్
- క్షత్రియ కార్పొరేషన్ కు రూ. 50 కోట్లు
- ఎంఎస్ఎంఈల ప్రోత్సాహానికి రూ. 400 కోట్లు
ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ. 2,26,177.53 కోట్లతో బడ్జెట్ ను రూపొందించారు. ఈ సందర్భంగా ఇప్పటికే ఉన్న పలు పథకాలకు బడ్జెట్ ను కేటాయిస్తూనే... కొత్తగా 6 పథకాలను ప్రవేశపెట్టారు. వీటికి కూడా బడ్జెట్ లో కేటాయింపులు జరిపారు.
ప్రవేశ పెట్టిన కొత్త పథకాలు, బడ్జెట్ కేటాయింపుల వివరాలు:
- అన్నదాత సుఖీభవ - రూ. 5 వేల కోట్లు
- క్షత్రియ కార్పొరేషన్ - రూ. 50 కోట్లు
- గృహ నిర్మాణాలకు భూసేకరణ - రూ. 500 కోట్లు
- ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం - రూ. 400 కోట్లు
- డ్రైవర్ల సాధికార సంస్థ - రూ. 150 కోట్లు
- మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన - రూ. 100 కోట్లు