Telugudesam: టీడీపీకి గుడ్ బై చెబుతున్న మరో కడప నేత

  • వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి ఖలీల్ బాషా
  • సాయంత్రం జగన్ తో భేటీ
  • టీడీపీలో గుర్తింపు లేదంటూ అసంతృప్తితో ఉన్న బాషా

కడప జిల్లాలో టీడీపీకి మరో ఎదురు దెబ్బ తగలనుంది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఖలీల్ బాషా టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు. ఈ సాయంత్రం హైదరాబాదులోని లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్ తో ఆయన భేటీ కానున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషాతో కలసి ఆయన హైదరాబాదుకు బయల్దేరారు. కడపలో 7వ తేదీన జరగనున్న శంఖారావం సభలో ఆయన అధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరోవైపు, టీడీపీలో తనకు తగినంత గుర్తింపు ఇవ్వడం లేదని ఖలీల్ బాషా గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే, పార్టీ మారాలనే నిర్ణయానికి ఆయన వచ్చారు.

Telugudesam
kadapa
khaleel basha
ysrcp
jagan
  • Loading...

More Telugu News