Ramesh Denade: క్యాన్సర్ తో 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' నటుడు రమేష్ భాట్కర్ మృతి!

  • ఎన్నో మరాఠీ, హిందీ చిత్రాల్లో నటించిన రమేష్ భాట్కర్
  • ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • నటుడిగా నాలుగు దశాబ్దాలు 

ఎన్నో మరాఠీ, హిందీ సినిమాల్లో నటించిన రమేష్ భాట్కర్, క్యాన్సర్ వ్యాధితో మరణించారు. పలు చిత్రాల్లో పోలీసు అధికారిగా నటించి మెప్పించిన ఆయన వయసు 70 సంవత్సరాలు. తాజాగా ఆయన అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో కనిపించిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' చిత్రంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ పాత్రను పోషించారు. గత కొంతకాలంగా ముంబైలోని ఎలిజబెత్ ఆసుపత్రిలో క్యాన్సర్ కు చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసినట్టు కుటుంబీకులు తెలిపారు. 1977లో చిత్రరంగంలోకి ప్రవేశించిన ఆయన, నాలుగు దశాబ్దాల పాటు నటిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ క్యాన్సర్ డే జరిగిన మరుసటిరోజునే ఆయన మృతిచెందడం గమనార్హం.

Ramesh Denade
Cancer
Died
  • Loading...

More Telugu News