gvl: జీవీఎల్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన టీడీపీ
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-ddb027373a2fa908688ab4a839376c1bb91a1761.jpg)
- నోటీసు ఇచ్చిన తెనాలి శ్రవణ్ కుమార్
- జీవీఎల్ ట్వీట్ ను నోటీసుకు జతచేసిన ఎమ్మెల్యే
- చంద్రబాబు పిచ్చి పీక్స్ కు చేరిందంటూ వ్యాఖ్యానించిన జీవీఎల్
ఏపీ శాసనసభను, ముఖ్యమంత్రి చంద్రబాబును కించపరిచే విధంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో... అసెంబ్లీలో ఆయనపై తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చారు. రూల్ 169 కింద అసెంబ్లీ స్పీకర్ కోడెలకు నోటీసులను అందజేశారు. ట్విట్టర్ వేదికగా జీవీఎల్ చేసిన కామెంట్ ను నోటీసుకు జత చేశారు.
'సీఎం చంద్రబాబు అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారితో ప్రవర్తించిన తీరు చూస్తే 'పిచ్చి పీక్స్ కు' చేరినట్టు తెలుస్తోంది. మహా ఫ్రస్ట్రేషన్లో ఉన్న సీఎం అసెంబ్లీ రౌడీలా ప్రవర్తించారు. సీఎంపై సభాహక్కుల నోటీసును ఇచ్చే ఆలోచన ఉంది' అని జీవీఎల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
![](https://img.ap7am.com/froala-uploads/froala-4c712f8df1972dc48dc8600da11a7578cdfae964.jpg)