raghuvaran: రఘువరన్ తో అలా పరిచయమైంది .. పెళ్లి జరిగింది: నటి రోహిణి

  • మలయాళంలో హీరోయిన్ గా తొలి సినిమా
  • నా ఫస్టు మూవీ హీరో రఘువరన్
  • మా అబ్బాయి 'రిషి' విదేశాల్లో చదువుతున్నాడు        

నటిగా సుదీర్ఘమైన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తోన్న రోహిణి .. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, "హీరోయిన్ గా నా మొదటి మలయాళ  సినిమా చేస్తున్నప్పుడు నా వయసు 15 సంవత్సరాలు. ఆ సినిమాలో హీరో రఘువరన్ .. ఆయన వయసు 23. ఆ సినిమా సమయంలోనే ఆయనతో పరిచయం ఏర్పడింది.

ఈ సినిమా తరువాత ఆయన కొన్ని సమస్యల్లో వున్నాడని తెలిసి నేను వెళ్లి మాట్లాడి వచ్చాను కూడా. ఆ తరువాత చాలా కాలానికి మళ్లీ ఇద్దరం కలిసి నటించాము. ఆ సమయంలోనే పెళ్లి ప్రస్తావన రావడం .. పెళ్లి చేసేసుకోవడం జరిగిపోయాయి. రఘువరన్ ఇప్పుడు లేకపోయినా ఆ ఫ్యామిలీతో మంచి సంబంధాలే వున్నాయి .. 'రిషి' వాళ్ల మనవాడే కదా. రిషికి ఇప్పుడు 20 యేళ్లు .. తాను ఇప్పుడు విదేశాల్లో చదువు కుంటున్నాడు. డాక్టర్ కావాలనే పట్టుదలతో వున్నాడు .. అక్కడ చదువు పూర్తయిన తరువాత తిరిగొస్తాడు" అని చెప్పుకొచ్చారు.

raghuvaran
rohini
  • Loading...

More Telugu News