World Bank: చెన్నైలోని వరల్డ్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ ఇంట్లో చోరీ!

  • చెన్నై తరమణి బ్యాంకు శాఖకు మేనేజర్ గా సునీల్ కుమార్
  • హైదరాబాద్ వెళ్లి వచ్చేసరికి దొంగతనం
  • దాదాపు రూ. కోటి చోరీ

ప్రపంచ బ్యాంకు బ్రాంచ్‌ మేనేజర్‌ ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈసీఆర్‌ రోడ్డులో నివసిస్తున్న సునీల్ కుమార్, తరమణిలోని ప్రపంచ బ్యాంకు శాఖకు మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఆయన తన కుటుంబంతో ఓ విలాసవంతమైన ఇంట్లో నివాసం ఉంటూ, ఈ నెల 1వ తేదీ శుక్రవారం నాడు హైదరాబాద్ కు వెళ్లి, 3వ తేదీ ఆదివారం నాడు తిరిగి వచ్చాడు.

రాగానే ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించాడు. వంటగది కిటికీ అద్దాన్ని పగులగొట్టి లోపలికి వచ్చిన దొంగలు, బీరువాలోని రూ. 20 లక్షల విలువైన 90 సవర్ల బంగారు నగలు, రూ. 80 వేల నగదు తీసుకెళ్లారు. జరిగిన ఘటనపై సునీల్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాఫ్తు ప్రారంభించారు.

World Bank
Chennai
Taramani
  • Loading...

More Telugu News