laurus labs: లారస్ ల్యాబ్స్ సీఈవో చావా సత్యనారాయణకు ప్రతిష్ఠాత్మక అవార్డు

  • మొత్తం 16 మందిని ఎంపిక చేసిన నిపుణుల బృందం
  • హైదరాబాద్‌లోని రెండు ఫార్మాస్యూటికల్ కంపెనీల సీఈవోలకు అవార్డు
  • అజీం ప్రేమ్‌జీకి లైఫ్ టైమ్ అవార్డు

ఔత్సాహిక పారిశ్రామికవేత్త, లారస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు, సీఈవో చావా సత్యనారాయణకు ప్రతిష్ఠాత్మక ‘ఈవై ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు లభించింది. ప్రతిభావంతులైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ఈ అవార్డు కోసం హైదరాబాద్‌లోని రెండు ఫార్మా కంపెనీల సీఈవోలు ఎంపిక కాగా, అందులో సత్యనారాయణ ఒకరు. ఇంటాస్ ఫార్మాస్యూటికల్స్ వైస్ చైర్మన్, ఎండీ బినీష్ చుద్గర్‌ మరొకరు.

‘ఈవై ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుల ఎంపిక కోసం ఉదయ్ కోటక్ నేతృత్వంలోని ఎనిమిది మంది నిపుణుల బృందం మొత్తం 16 మందిని ఎంపిక చేసింది. వీరిలో  ఫ్యూచర్‌ గ్రూపు వ్యవస్థాపకుడు, సీఈఓ కిశోర్‌ బియానీ, టైటాన్‌ కంపెనీ ఎండీ భాస్కర్‌ భట్‌, ఐషర్‌ మోటార్స్‌ ఎండీ, సీఈఓ సిద్ధార్ధ లాల్‌ తదితరులు ఉన్నారు. విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీని లైఫ్‌టైమ్‌ ఎచీవ్ మెంట్ అవార్డు వరించింది.

laurus labs
Hyderabad
chava Satyanarayana
ey entrepreneur of the year 2018
  • Loading...

More Telugu News