vijya malya: విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ అంగీకారం

  • వేల కోట్లు ఎగ్గొట్టి బ్రిటన్ లో తలదాచుకున్న మాల్యా
  • భారత్ కు అప్పగించేందుకు అనుమతి 
  • సంబంధిత ఫైల్ పై బ్రిటన్ హోం శాఖ సంతకం

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి, విదేశాలకు చెక్కేసిన యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకు సంబంధించి బ్రిటన్ హోం మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది. ఈ మేరకు సంబంధిత ఫైల్ పై సంతకం చేసింది. దీంతో, మాల్యాను ఏ క్షణమైనా భారత్ కు తీసుకొచ్చే అవకాశాలున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం. కాగా, మాల్యాను భారత్ కు అప్పగించాలని చాలా కాలంగా బ్రిటన్ ని మన ప్రభుత్వం కోరుతోంది.  

vijya malya
britain
home ministry
india
  • Loading...

More Telugu News