Tollywood: ఫోర్బ్స్ ‘30 అండర్ 30’లో విజయ్ దేవరకొండకు స్థానం!

  • 30 సంవత్సరాల లోపు ప్రతిభ కనబరిచిన వారి పేర్లు
  •  విజయ్ దేవరకొండ వయసు 29 ఏళ్లు 
  • 'నువ్విలా' సినిమాతో చిత్ర రంగ ప్రవేశం 

ప్రముఖ యువ హీరో విజయ్ దేవరకొండకు 2019- ఫోర్బ్స్ ఇండియా ‘30 అండర్ 30‘లో చోటు దక్కింది. భారత్ లో ముప్పై సంవత్సరాల కన్నా తక్కువ వయసుకు చెందిన, ఆయా రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారికి ఈ జాబితాలో స్థానం కల్పించారు. ఇందుకు సంబంధించిన జాబితాను ఫోర్బ్స్ ఈరోజు విడుదల చేసింది. సినీ నటుడిగా తన ప్రతిభను చాటుకున్న విజయ్ దేవరకొండ పేరు ఈ జాబితాలో చేరింది.

 ఇరవై తొమ్మిదేళ్ల విజయ్ దేవరకొండ 2011లో ‘నువ్విలా’ చిత్రం ద్వారా నటుడిగా చిత్ర రంగంలోకి అడుగుపెట్టాడు. 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’లో అతిథిపాత్రలో నటించాడు. ఆ తర్వాత ‘పెళ్లి చూపులు’తో హిట్ సాధించి, ‘అర్జున్ రెడ్డి’తో ఓ రేంజ్ హిట్ ను సాధించాడు. గత ఏడాది విడుదలైన ‘గీత గోవిందం’ కూడా విజయ్ దేవర కొండకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తున్నాడు.

Tollywood
hero
vijaya devara konda
2019 forbes India
30 under 30
gita govindam
  • Loading...

More Telugu News