rajnath singh: రాజ్‌నాథ్‌కు నివేదిక పంపిన పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌

  • కేసరినాథ్ త్రిపాఠితో ఫోన్ లో మాట్లాడిన రాజ్ నాథ్
  • రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చ
  • నివేదిక పంపాలంటూ సూచన

పశ్చిమబెంగాల్ లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు నివేదిక పంపినట్టు కోల్ కతాలోని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠితో రాజ్ నాథ్ ఫోన్ లో చర్చించారు. అనంతరం నివేదిక పంపించాలని కోరారు.

శారదా కుంభకోణం కేసులో కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను విచారించేందుకు సీబీఐ అధికారులు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులను రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ముఖ్యమంత్రి మమత బెనర్జీ ధర్నాకు దిగారు. దీంతో, ఆ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

rajnath singh
kesarinath tripathi
west bengal
governor
report
  • Loading...

More Telugu News