Andhra Pradesh: ఏపీలో టీడీపీ, వైసీపీలు రెండూ అవినీతి పార్టీలే: అమిత్ షా

  • ఈ రాష్ట్రానికి బీజేపీ వల్లే న్యాయం జరుగుతుంది
  • బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నది అబద్ధం  
  • ఏపీకి రూ.5.56 లక్షల కోట్ల పనులు చేశాం

ఏపీలో టీడీపీ, వైసీపీలు రెండూ అవినీతి పార్టీలేనని, ఈ రాష్ట్రానికి బీజేపీ వల్లే న్యాయం జరుగుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఏపీ పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన విజయనగరం వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ, ఏపీకి బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఏపీకి ఇప్పటివరకూ రూ.5.56 లక్షల కోట్ల పనులు చేశామని, దీనిపై చర్చకు చంద్రబాబు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఏపీకి 20 జాతీయ సంస్థలు, పది లక్షల పక్కా ఇళ్లు మంజూరు చేశామని, బాబు సహకరించకపోయినా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, కీలకమైన 14 అంశాల్లో పది అంశాలను పూర్తి చేశామని వివరించి చెప్పారు. 

Andhra Pradesh
vijyayanagaram
amith shah
Chandrababu
Telugudesam
YSRCP
Jagan
  • Loading...

More Telugu News