MLA Roja: బాబుకు మహిళలపై ప్రేమ ఉంటే డ్వాక్రా రుణాలు రద్దుచేసి మాట్లాడాలి: ఎమ్మెల్యే రోజా

  • చేతనైతే బెల్టు షాపుల్లేకుండా చూడాలి
  • ‘పసుపు-కుంకుమ‘ పథకం పెద్ద డ్రామా
  • సంబరాలకు వచ్చే టీడీపీ నేతలను తరిమికొట్టాలని పిలుపు

ఎన్నికలు వస్తున్నాయని మహిళలపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాను హామీ ఇచ్చినట్టుగా వారి డ్వాక్రా రుణాలు రద్దు చేయాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. అలాగే మహిళ తాళిబొట్లు తెగిపోయేందుకు కారణమవుతున్న బెల్టు షాపులను పూర్తిగా రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు.

ఆమె మీడియాతో మాట్లాడుతూ  ‘పసుపు-కుంకుమ‘ పథకం పెద్ద డ్రామా అని, చెల్లని చెక్కులు అందించి సంబరాల పేరుతోనూ టీడీపీ నాయకులు దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.  సంబరాల పేరుతో గ్రామాలకు వచ్చే వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. అవుట్‌ డేటెడ్‌ చంద్రబాబు మానసిక స్థిమితాన్ని కోల్పోయారని, అందుకే పోస్టు డేటెడ్‌ చెక్కులు ఇచ్చి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుండడంతో ఏం చేయాలో అర్థంకాక జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన నవరత్నాల పథకాన్ని కాపీ కొడుతున్నారని విమర్శించారు. బెల్టు షాప్ ల రద్దు, ఆడవాళ్ళకు రక్షణ, డ్వాక్రా రుణాల మాఫి హామీలను చంద్రబాబు నిలబెట్టుకోలేదని, ప్రజలకు ఈ విషయం తెలుసని అన్నారు.

MLA Roja
Chandrababu
pasupu kunkuma padhakam
  • Loading...

More Telugu News