paritala sunitha: అందుకే పరిటాల సునీతపై చెప్పులు, చీపుర్లతో తిరుగుబాటు చేశారు: రోజా ఎద్దేవా

  • అరాచకాలను తట్టుకోలేకే సునీతపై తిరుగుబాటు చేశారు
  • ఏం చేశారని చంద్రబాబుకు మళ్లీ ఓటు వేయాలి
  • పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు మరోసారి మోసానికి దిగారు

డ్వాక్రా రుణాలను సకాలంలో మాఫీ చేసి ఉంటే... అక్కచెల్లెమ్మల ఆత్మహత్యలు జరిగి ఉండేవి కాదని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తూ కొత్త నాటకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తెరలేపారని విమర్శించారు. టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలు శ్రుతి మించాయని... అరాచకాలను తట్టుకోలేకే మంత్రి పరిటాల సునీతపై మహిళలు చెప్పులు, చీపుర్లతో తిరుగుబాటు చేశారని ఆమె అన్నారు. మహిళలకు న్యాయం చేయలేని సునీతకు జగన్ ను విమర్శించే హక్కు లేదని అన్నారు.

నరకాసుర పాలన చేస్తున్న చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలని రోజా పిలుపునిచ్చారు. తమకు మళ్లీ ఓటు వేయాలని చంద్రబాబు అడుగుతున్నారని... ఏం చేశారని ఆయనకు మళ్లీ ఓటు వేయాలని ప్రశ్నించారు. పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు మరోసారి మోసానికి దిగారని అన్నారు. మహిళల తాళిబొట్టులు తెంపేలా చంద్రబాబు పాలన ఉందని విమర్శించారు.  చిత్తూరులో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై టీడీపీ నేతల దాడిని రోజా ఖండించారు.

paritala sunitha
roja
jagan
Chandrababu
Telugudesam
ysrcp
  • Loading...

More Telugu News